వివాదంగా మారుతున్న తెలంగాణ రాష్ట్ర గీతం..!!

తెలంగాణ రాష్ట్ర గీతం( Telangana State Anthem ) వివాదాస్పదంగా మారుతుంది.

తెలంగాణ అధికారిక గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి( MM Keeravani ) మ్యూజిక్ అందించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది.

ఈ మేరకు రాష్ట్ర అధికారిక గీతాన్ని కీరవాణి స్వరపరచడాన్ని తెలంగాణ సినీ మ్యుజీషియన్ అసోసియేషన్( Telangana Cine Musicians Association ) వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ కవులు, కళాకారులకు ఇది అవమానమని అసోసియేషన్ పేర్కొంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర గీతానికి తెలంగాణ కళాకారులతో మ్యూజిక్ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) రాష్ట్ర సినీ మ్యుజీషియన్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుంది.

వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు