అనుమతులు తెచ్చుకొని ప్రాజెక్ట్ కట్టుకోండి..!

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వ్యవహారం మాటల యుద్ధం కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే సంగమేశ్వ రం ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్ట్ కట్టుకోమని చెప్పారు.మహబూబ్ నగర్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ కృష్ణా జలాల పై వివాదాను ఏపీ ఆపాలని చెప్పారు.

ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమని అన్నారు.తెలంగాణాలోని ఏపీ ప్రజలు ఏనాడైనా వారి వ్యాపారాలు అడ్డుకుంటున్నారని చెప్పారా అని ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్.

వారి ఆస్తులు, ఉద్యోగాలు, పరిశ్రమలకు తాము ఏమైనా ఇబ్బందులు కల్పించామా అని అన్నారు.ఈ ఏడేళ్లలో హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారా అని ప్రశ్నించారు.

Advertisement

తెలంగాణాలో కాలనీలు, పార్కులకు పెట్టిన ఆంధ్రా వారి పేర్లను తామేమైనా తొలగించామా అని అనారు శ్రీనివాస్ గౌడ్.ఆనాడు ఆంధ్రా నేతలే తెలంగాణా అన్న పదాన్ని అసెంబ్లీలో పలకకుండా చేశారని ఆయన ఫైర్ అయ్యారు.

ఎంతోమంది మరణాలకు నాటి ఆంధ్రా నాయకులే కారణమని అన్నారు శ్రీనివాస్ గౌడ్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమనంత్రులు జోక్యం చేసుకుంటేనే తప్ప ఈ వ్యవహారానికి ఒక ముగింపు వచ్చేలా లేదు.

Advertisement

తాజా వార్తలు