ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ 

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తూ,  బదిలీ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు( Govt Employees Transfers ) తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

  2018 తరువాత సాధారణ బదిలీలపై( General Transfers ) విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈనెల ఐదు నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అనుమతించింది.

ఈ ఉత్తర్వులతో చాలా ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీ అనివార్యం కానుంది.జిల్లాల్లో పలువురు జిల్లా స్థాయి అధికారులతో పాటు , ఉద్యోగుల బదిలీ అనివార్యం కాబోతోంది.

తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) బదిలీలపై నిషేధం ఎత్తు వేస్తూ తీసుకున్న నిర్ణయం పై ఉద్యోగులు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.చాలా ఏళ్లుగా ఎటువంటి బదిలీ లు లేకపోవడంతో అనేకమంది జిల్లా స్థాయి అధికారులు తో పాటు,  ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నారు, కొన్ని శాఖల్లోని అధికారులు 20 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు.ఈ ఏడాది జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తికాని ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది.

Advertisement

ఒక స్థానంలో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.వచ్చే ఏడాది జూన్ 30 వరకు పదవి విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ బదిలీల నుంచి మినహాయింపును ఇచ్చారు.

ఏ క్యాడర్ లోనైనా, 40 శాతానికి మించి బదిలీలు చేయవద్దని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొంది.దీంతో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు, బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అయ్యే అవకాశం ఉంది.గతంలో బదిలీల కోసం అనేకసార్లు దరఖాస్తు చేసుకున్న ప్రయోజనం లేక ఉద్యోగులు బదిలీల కోసం  వేచి చూస్తూ వస్తున్నారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బదిలీల కోసం వేచి చూస్తున్న ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు