ఇటీవలె మాజీ మిస్ తెలంగాణ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి మనందరికీ తెలిసిందే.రెండు రోజుల వ్యవధిలోనే మరొకసారి ఆత్మహత్యకు వచ్చింది.
తాజాగా ఆమె కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జిపై నుంచి మునేటిలోకి దూకీ ఆత్మహత్యకు పాల్పడింది.కృష్ణాజిల్లా నందిగామ లో బైక్ పై వచ్చి, వాహనాన్ని బ్రిడ్జి పైన నిలిపి నీటిలోకి దూకేసింది.
ఆమె నీటిలోకి దూకడం గమనించి స్థానికులు ఆమెను రక్షించి అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హాసిని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా బూధవాడ గ్రామం.
మోడలింగ్ పై ఆసక్తి తో హైదరాబాదులో ఉంటుంది.ఈ క్రమంలోనే 2018 లో హాసిని మిస్ తెలంగాణ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది.
రెండు రోజుల క్రితమే ఈమె హిమాయత్ నగర్ లోని తన అపార్ట్మెంట్లో ఫ్యాన్ కు చున్నీ తో ఉరి వేసుకోబోతున్నాను అంటూ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.ఇక వెంటనే జగిత్యాలకు చెందిన ఒక స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆమె వేసుకున్న చున్నీ ముడి జారిపోయి మంచంపై పడిపోయిన స్థితిలో ఉంది.వెంటనే పోలీసులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలుపగా, వారు వచ్చి ఆమెను కృష్ణాజిల్లా తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు.స్థానికులు గమనించి నా ప్రాణాలు కాపాడారు.ఇక ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.ప్రస్తుతం ఆమె నందిగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.