ఆంధ్రోళ్ల కింద పనిచెయ్యం

ఆంధ్రోళ్ల కింద పనిచెయ్యబోమని ఎవరు చెబుతారు? తెలంగాణవారే కదా.ఇది అందరికీ తెలిసిందే.

ఆంధ్రా అధికారుల కింద తాము పనిచేయబోమని తెలంగాణ ఉద్యోగులు తేల్చిచెప్పారు.తెలంగాణ రాష్ర్ట ఆవిష్కరణ దినోత్సవమైన జూన్‌ రెండో తేదీలోగా ఆంధ్రా అధికారులందరినీ వారి రాష్ర్టానికి పంపించెయ్యలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మను కలిసి తమ డిమాండ్‌ను వివరించారు.కమలనాథన్‌ కమిటీ తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు, ఆంధ్రా ఉద్యగులను తెలంగాణకు కేటాయించిందన్నారు.

తెలంగాణలో ఆంధ్రావారు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని, తెలంగాణవారికి అన్యాయం జరిగిందన్నారు.ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, రెవిన్యూ మొదలైన శాఖల్లో ఆంధ్రావారు పెద్ద పోస్టుల్లో ఉన్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తెలంగాణవారు ఆంధ్రా అధికారుల కింద పనిచేస్తే ఇక రాష్ర్టం సాధించుకొని ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.ఎట్టి పరిస్థితిలోనూ జూన్‌ రెండో తేదీలోగా ఆంధ్రావారిని పంపెయ్యాలని డిమాండ్‌ చేశారు.

రాష్ర్టం విడిపోయాక అధికారుల, ఉద్యోగుల కేటాయింపులు త్వరగా పూర్తిగాకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి.సామాన్య ప్రజల మధ్య కూడా ద్వేషభావం పెరగకముందే ప్రభుత్వాలు మేలుకొని చర్యలు తీసుకోవాలి.

లేకపోతే మళ్లీ తెలంగాణ ఉద్యమం వంటిది మొదలవుతుంది.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు