తెలంగాణ కొత్త మంత్రులు : ఎవరెవరికి ఏ ఏ శాఖలంటే.. ? 

తెలంగాణ కొత్త మంత్రివర్గం కొలువు తీరింది.ఇటీవల ఎన్నికల ఫలితాలలో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా,  ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ, మల్లు బట్టి విక్రమార్క కు రెవెన్యూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ, పొన్నం ప్రభాకర్ కి బీసీ సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖను రేవంత్ రెడ్డి కేటాయించారు.ఇక మిగతా మంత్రుల ఎంపిక చేపట్టి పూర్తిస్థాయిలో తెలంగాణ క్యాబినెట్ ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టారు.

  ఇప్పటికే ఈ మంత్రి వర్గ కూర్పు పై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించి వారి సూచనలతో కొత్త మంత్రులకు రేవంత్ శాఖలను కేటాయించారు.ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై తొలి సంతకాన్ని చేశారు.

Advertisement

రెండవ సంతకాన్ని దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక పత్రంపై చేశారు.ఇక అన్ని శాఖల అధికారులతో సమీక్షలు చేపట్టి , తెలంగాణలో తను మార్క్ పరిపాలనను మొదలు పెట్టేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

 పార్టీలోనూ,  ప్రభుత్వంలోనూ ఎక్కడా ఎటువంటి అసంతృప్తులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ .ప్రజల మెప్పు పొందే విధంగాను , కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకునేందుకు రేవంత్ ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు