సురేఖ ఇచ్చిన ట్విస్ట్ తో కాంగ్రెస్ లో ఆందోళన ?

తెలంగాణ కాంగ్రెస్ లో హుజూరాబాద్ ఎన్నికల సందడి మొదలైనట్టు కనిపించినా, అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా ఆ పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

ఎవరిని ఇక్కడ పోటీకి దింపితే గెలుస్తారు అనే విషయంలో చాలా తర్జనభర్జన పడుతోంది.

ఎవరిని ఇక్కడ నుంచి పోటీకి దించినా తప్పనిసరిగా టిఆర్ఎస్ బిజెపి అభ్యర్థులపై గెలిచే వారిని దించాలని చూస్తుంది.అందుకే ఇంతగా తంటాలు పడుతోంది.

మొదటగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను పోటీకి దింపాలి అని చూశారు.కరీంనగర్ జిల్లాలో ప్రభాకర్ కు గట్టి పట్టు ఉండడంతో, ఆయనే సరైన అభ్యర్థి అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావించారు.

కానీ పొన్నం ప్రభాకర్ తాను పోటీ చేయను అని తేల్చడంతో కొండా సురేఖ వైపు అందరి చూపు పడింది.వరంగల్ జిల్లాలో బలమైన నాయకురాలిగా ఉన్న ఆమెను హుజురాబాద్ లో పోటీకి దింపితే ఫలితం అనుకూలంగా ఉంటుందని, బీసీ సామాజికవర్గానికి చెందిన సురేఖ ఈటెల రాజేందర్ , గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై సునాయాసంగా గెలుస్తారని నమ్మకంతో వుంటూ వచ్చారు.

Advertisement

అయితే అకస్మాత్తుగా సురేఖ కొత్త కండిషన్లు విధించారు.ప్రస్తుతానికి హుజురాబాద్ లో పోటీ చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని , కానీ వచ్చే ఎన్నికల్లో తాను వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

ప్రస్తుతానికి ఇక్కడ పోటీ చేసినా, రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఆమె ఉండరని , దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ప్రచారాన్ని మొదలు పెట్టేశారు.

తాను గతంలో పరకాల నియోజకవర్గంలో పోటీ చేసి తప్పు చేశానని, ఆమె చెప్పడం ఇబ్బందికరంగా మారింది.పోనీ సురేఖకు వచ్చే ఎన్నికల్లోనూ హుజూరాబాద్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చి, ఆమె భర్త కొండా మురళి కి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పైన తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది.కానీ ఒక కుటుంబంలో ఒకరికి టికెట్ అనే నియమం ఉండడంతో ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలి అనేది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదు.

ఈ నియోజకవర్గంలో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ అంతటా అధికారంలోకి రాబోతోందని సంకేతాలు ఇద్దామని చూస్తున్న సమయంలో సురేఖ ఇచ్చిన ట్విస్ట్ పై ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు