రేవంత్ ను ఇలా టార్గెట్ చేసుకున్న కేటీఆర్ ?

తెలంగాణలో తమకు ప్రధాన రాజకీయ శత్రువులుగా మారి, ప్రతి వ్యవహారంలో తలదూర్చి ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టింది.

ఆయన దూకుడుకు కళ్లెం వేసేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటూ వస్తోంది.

కెసిఆర్ కేటీఆర్ కు సంబంధించిన వ్యవహారాల్లో రేవంత్ తలదూర్చి అనవసర గందరగోళం సృష్టిస్తూ, ప్రజల్లో తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా  చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి దూకుడుకి చెక్ పెట్టే విధంగా కేటీఆర్ సరికొత్త ప్లాన్ వేసుకున్నారు.ముఖ్యంగా త్వరలోనే జిహెచ్ఎంసి ఎన్నికలు సమీపిస్తుండడంతో హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెంచింది.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరిపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెంచి, ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రేవంత్ దూకుడుకు బ్రేకులు వేసే అంశంపైన, ప్రగతి భవన్ లో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.

Advertisement

ఇప్పటికే ఇక్కడ  చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల్లో బాగా సంతృప్తి  వ్యక్తం అవుతోందని, లాక్ డౌన్ సమయంలోనే నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఈ సందర్భంగా చాలా మంది ఎమ్మెల్యేలు కేటీఆర్కు చెప్పారు.అలాగే మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని, ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని, మళ్ళీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు తిరుగులేకుండా చేయాలని అనేక సూచనలను కేటీఆర్ చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి హవా పెరగకుండా, ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించకుండా పూర్తిగా అన్ని రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని, రేవంత్ ప్రభావం ఎక్కడా కనిపించకుండా చూడాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.మొత్తంగా చూస్తే రేవంత్ దూకుడు మల్కాజ్ గిరి ప్రాంతంలో తగ్గించాలని జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్ని స్థానాలను దక్కించుకునేలా కేటీఆర్ ప్లాన్ వేస్తున్నారు.

అందుకే తన రాజకీయ ప్రధాన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ప్రభావం రోజు రోజు కి తగ్గించేలా కేటీఆర్ సరికొత్త ఎత్తుగడతో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్నారు.

మాచర్లకు వెళ్ళకూడదు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు ఆదేశాలు..!!
Advertisement

తాజా వార్తలు