ఒకప్పుడు స్టూడెంట్ లీడర్ ఇప్పుడు సీఎం రేసులో.. తెలంగాణ బాహుబలి రేవంత్ రెడ్డి ప్రస్థానం ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొలువుదీరనున్న సంగతి తెలిసిందే.

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ ఆయన పేరును ఖరారు చేసిందని తెలుస్తోంది.

అయితే ఈ స్థాయికి చేరుకోవడం వెనుక రేవంత్ రెడ్డి కష్టం ఎంతో ఉంది.ఒకప్పుడు స్టూడెంట్ లీడర్ గా పని చేసిన రేవంత్ రెడ్డి కేవలం 17 సంవత్సరాలలో జడ్పీటీసీ నుంచి సీఎం రేసులో ఉండే స్థాయిలో నిలిచారు.

రాజకీయ విశ్లేషకులు రేవంత్ రెడ్డిని తెలంగాణ బాహుబలిగా చెబుతున్నారు.తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించడంతో పాటు చరిత్ర తిరగరాశారు.అలుపెరగని పోరాటంతో రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు.2006 సంవత్సరంలో జడ్పీటీసీగా గెలుపొందిన రేవంత్ రెడ్డి పార్టీని విజయపథంలో నడిపించే నేతగా ఎదిగారు.2021 సంవత్సరంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ తన ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజల ఆదరణను పొందారు.

నెలరోజుల్లో ఏకంగా 83 ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చేలా చేశారు.1968 సంవత్సరం నవంబర్ 8న జన్మించిన రేవంత్ వనపర్తి( Wanaparthy )లో పాలిటెక్నిక్ చదివారు.2002 సంవత్సరంలో టీ.ఆర్.ఎస్ లో చేరిన రేవంత్ 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి ఓడించారు.

Advertisement

2008లో టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి 2009లో కొడంగల్ నుంచి పోటీ చేసి దాదాపుగా 7 వేల ఓట్ల ఆద్జిక్యంతో గెలిచారు.2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.2017లో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయితే 2019 మే నెలలో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ ( Kodangal )నుంచి మరోసారి ఘనవిజయం సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు