తెలంగాణ కాంగ్రెస్ లో 'కేవీపీ 'కలకలం ! 

తెలంగాణ కాంగ్రెస్ లో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం సూచనతో ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.

ఇటీవల ప్రకటించిన కమిటీలలోను తమకు ప్రాధాన్యం దక్కలేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ల అభిప్రాయాలను సేకరించేందుకు దిగ్విజయ సింగ్ రంగంలోకి దిగారు.ఏ ఏ విషయాల్లో సీనియర్లు అసంతృప్తికి గురవుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అలాగే రేవంత్ , మాణిక్యం ఠాగూర్ కారణంగా తాము ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే విషయాన్ని సీనియర్లు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు.      ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్లకు దిగ్విజయ్ సింగ్ క్లాస్ పీకారు.

ఇదిలా ఉంటే దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్న సమయంలోనే,  ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.అసలు ఆయన వస్తున్నట్లుగా ముందస్తు సమాచారం లేకుండానే దిగ్విజయ్ భేటీ అయ్యారు.

Advertisement

దాదాపు గంటన్నర పాటు కేవీపీ రామచంద్ర రావు దిగ్విజయ్ సింగ్ తో చర్చించారు.అయితే ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా కెవిపితో చర్చించినట్లుగా సీనియర్లు అనుమానిస్తున్నారు.

ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో కెవిపి ఎక్కువగా భాగస్వామ్యం అవుతున్నారని,  మొదట్లో సీనియర్లకు అనుకూలంగా ఉన్నట్లుగా వ్యవహరించినా,  ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.   

     కెవిపి రామచంద్ర రావు తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని , ఇప్పుడు రేవంత్ ను ఆయన ప్రోత్సహించడం వెనుక కారణాలు ఏమిటి అనేదానిపైన సీనియర్లు చర్చించుకుంటున్నారు.ఒకవైపు కాంగ్రెస్ సీనియర్లు మరోవైపు రేవంత్ వర్గం విషయంలో దిగ్విజయ్ సింగ్ చర్చిస్తున్న సమయంలోనే కెవిపి ఎంట్రీ ఇవ్వడం పై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కెవిపి ఎంట్రీ అయిన తరువాతే రేవంత్ కు అనుకూలంగా దిగ్విజయ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారని,  అందుకే సీనియర్లకు వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.

పార్టీలో సీనియర్లు,  జూనియర్లు అన బేధం ఉండదని, పార్టీలో నాయకుల ప్రయోజనాలు ముఖ్యం కాదని , పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని అంతర్గతంగా కోట్లాటలు మానుకుని ప్రజా సమస్యలపై రోడ్డెక్కి పార్టీ కోసం పోరాడాలని సీనియర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చెప్పడం వెనుక కేవీపీ హస్తం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి.దీంతో మొన్నటి వరకు కెవిపి విషయంలో సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు ఆయనపై రుస రుసలాడుతున్నారు.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు