రేవంత్ రెడ్డి ' ఆకస్మిక ' నిర్ణయం .. ఇక పరుగులు పెట్టిస్తారా ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించేందుకు నిర్ణయించుకున్నారు .

ఇకపై పాలనలో తన మార్క్ కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బీఆర్ఎస్ అధినేత  మాజీ సీఎం కేసీఆర్,  వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ పరిపాలనను పరిగణలోకి తీసుకొని వారు చేసిన తప్పిదాలు తాను చేయకూడదని నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారు.జగన్ , కేసీఆర్  పూర్తిగా తమ కార్యాలయాలకు పరిమితం కావడం ,జనాల్లోకి వెళ్ళకపోవడం వల్లనే వారు మాజీలు అయ్యారని, ఆ తప్పు తాను చేయకుండా పూర్తిగా జనాలతో మమేకం అయ్యే విధంగా పరిపాలనలో పారదర్శకతను పెంచే విధంగా రేవంత్ సిద్ధమవుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత లోక్ సభ ఎన్నికలు రావడం , ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పూర్తిగా ఎన్నికల వ్యవహాల పైన ఫోకస్ చేశారు.దీంతో పాలనపరంగా ముందుకు వెళ్లేందుకు ఎన్నికల కోడ్( Election Code ) సైతం అడ్డు వచ్చింది.

 అయతే ఇప్పుడు అన్ని వ్యవహారాలు చక్కబడటంతో ,  పరిపాలనపై రేవంత్ దృష్టి పెట్టారు.  ఈ మేరకు ప్రతినెల సెక్రటరీలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.  అయితే ఈ సమావేశానికి మొక్కుబడుగా వస్తే కుదరదని , పనిచేసే అధికారులకు తన సహకారం ఉంటుందని,  లేని వారిపై చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడనని ఐఏఎస్ లకు రేవంత్ హెచ్చరికలు చేశారు .

Advertisement

 కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం లేదని , ఇకపై తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని రేవంత్ ఐఏఎస్ లకు చెప్పారు .ఆకస్మిక తనిఖీలతో జిల్లాలోని అధికారులను పరుగులు పెట్టించాలని ,  ఆసుపత్రులు విద్యాలయాలు వంటి వాటిని ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునేలా రేవంత్  ప్రభుత్వ అధికారులు కేవలం ఆఫీసులో కూర్చుంటే సరిపోదని , ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేలా రేవంత్ ప్లాన్ సిద్ధం చేశారు.

ఓర్నీ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేది ఇందుకేనా రేవంతూ ? 
Advertisement

తాజా వార్తలు