తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యలూ, నిర్ణయాలూ ఎవ్వరూ ఊహించలేనివీ ఊహకి అందినివి గా ఉంటాయి.అలా అనడానికి మరొక ఉదాహరణ ఈ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అని చెప్పచ్చు.
ఒకప్పుడు పేదల ఇళ్ళు అంటే పిచుక గూళ్ళు లాగా ఉండేవి కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరవాత అధికారం లోకి వచ్చిన తెరాస సర్కారు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తుంది అంటూ ఎప్పుడో ప్రకటన చేసారు కూడా.హైదరాబాద్ నగరం లోని ఐడీహెచ్ కాలనీలో ఒక్కచోటే నిర్మించినప్పటికీ ఆ ఇళ్లు తెలంగాణ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.
ప్రభుత్వం ఇంకా ప్రకటన విడుదల చేయనప్పటికీ వేలకొద్ది కలెక్టర్ కార్యాలయాలకు వస్తున్న దరఖాస్తులే ఇందుకునిదర్శనం.
తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కేసీఆర్ మరో కీలక అడుగు వేసి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధపడ్డారు.
మరొక ఏడు చోట్ల డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం టెండర్ లు పిలుస్తున్నారు సర్కారు వారు.సనత్ నగర్ – యాకుత్ పురా – మలక్ పేట – అంబర్ పేట – ముషీరాబాద్ – ఖైరతాబాద్ – దోభీఘాట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోక్క ప్రాంతాన్ని ఎంపిక చేసి తొమ్మిది అంతస్తుల భనవాలను నిర్మించనున్నారు.
ఇందులో అసలు విశేషం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూం ఇళ్లలో లిఫ్టులు కూడా ఉండనున్నాయి.కేవలం లిఫ్టుల కోసమే నూట యాభై కోట్లు మంజూరు అయ్యింది.
టెండర్ల ప్రక్రియ కూడా 11 నుంచీ మొదలు పెట్టి వచ్చే నెల నాలుగు తో ముగిస్తారు.ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కెసిఆర్ ని ఎవరన్నా మరచిపోగలరా ?







