అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకూ భావ్యం అనేది అధికారంలో ఉన్న వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఒచ్చింది.ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి చాలా గౌరవం ఉండి తీరుతుంది.
కానీ ఆ మధ్య కెసిఆర్ వరంగల్ లో మాట్లాడుతూ తమకి వ్యతిరేకంగా మాటలు , వార్తలూ రాస్తే నిలువునా పాతిపెడతాం అని మీడియా కి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే వరసలో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుచేరిపోయారు.
జన్మ భూమి, మా ఊరు కార్యక్రమం లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు.స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు వివిధ ప్రశ్నలు అడగగా అందుకు స్పందిచిన చంద్రబాబు…పాత్రికేయులా? తీవ్రవాదులా అని ప్రశ్నించారు.
దీంతో అవమానంగా భావించిన పాత్రికేయులు మౌన ప్రదర్శన చేపట్టారు.అంతే కాకుండా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు.ప్రతిపక్ష పార్టీ వై కా పా , కాంగ్రెస్ , లెఫ్ట్ లు కలిసి చంద్రబాబు చేసిన కామెంట్ లని ఖండించాయి.దీని మీద తెలుగు దేశం నాయకులు వివరణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసారు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న సమయంలో సరైన ప్రశ్నలు అడగకుండా విషయాలని వక్రీకరిస్తూ మీడియా వారు అడిగిన ప్రశ్నలకి బాబు కి కోపం వచ్చింది అని వారు నచ్చ జెప్పే ప్రయత్నం చేసారు.







