యువ హీరో హార్డ్ వర్క్..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జా ఈమధ్య హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.

అతను చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను అందుకుంటున్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో హనుమాన్ సినిమా చేస్తున్న తేజ ఆ సినిమాతో కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా రాబోతున్న హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జా చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.

Teja Sajja Hardwork For Hanuman Movie Details, Hamuman Movie, Prasanth Varma, Te

సినిమా కోసం ఒక సీన్ లో రోప్ మీద 8 గంటల పాటు డూప్ లేకుండా ఉంటున్నాడట.దాదాపు వారం రోజుల నుండి ఆ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.

మొత్తానికి యువ హీరో హార్డ్ వర్క్ కి తగిన ఫలితం వస్తుందని చెప్పొచ్చు.జాంబి రెడ్డితో హిట్ అందుకున్న తేజ సజ్జ ఇష్క్, అద్భుతం సినిమాలతో నిరాశపరచాడు.

Advertisement

మరి హనుమాన్ సినిమాతో అయినా తేజ సజ్జా హిట్ కొడతాడో లేదో చూడాలి.టాలెంటెడ్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న హనుమాన్ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

 హనుమాన్ తో ప్రశాంత్ వర్మ తన సత్తా చాటుతాడని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు