పవన్-బాలయ్య టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్.. ఇక ఎపిసోడ్ వస్తే ఆహా బద్దలే!

నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’.సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

 Teaser Of Nandamuri Balakrishna And Pawan Kalyan Unstoppable 2 , Unstoppable 2,-TeluguStop.com

సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా స్టార్ట్ చేసారు.ఇప్పటికే సీజన్ 2 నుండి వచ్చిన ఎపిసోడ్స్ అందరిని ఆకట్టు కున్నాయి.

ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ తో అయితే ఆహా యాప్ బద్దలు అయ్యింది.

ఇక ఇప్పుడు మరోసారి ఆహా బ్లాస్ట్ కాబోతుంది.

ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షోకు విచ్చేశాడు.త్వరలోనే ఈయన ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది.

అంతకంటే ముందు పవన్ ఎపిసోడ్ నుండి గ్లిమ్స్ అని టీజర్ అని వదులుతూ మరింత ఉత్సాహం పెంచుతున్నారు.భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో మరింత హైప్ నెలకొంది.

తాజాగా వచ్చిన ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ లో 20 లక్షలకు పైగానే వ్యూస్ తో పాటుగా 2 లక్షలకు పైగా లైక్స్ అందుకుని దూసుకు పోతుంది.ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే ఇక ఎపిసోడ్ ఫుల్ వస్తే ఆహా యాప్ స్మాష్ అవ్వడం ఖాయం అంటున్నారు.మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కానుందో వేచి చూడాలి.

ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.బాలయ్య సంక్రాంతి పండుగకు వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయనున్నాడు.ఇక పవర్ స్టార్ ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.

నెమ్మదిగా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.ఈ సమ్మర్ లోనే వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube