ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయి.అన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి.
ఇంత భారీ ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నా కూడా ఎక్కడ ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తగా షూటింగులు మానేజ్ చేస్తున్నాడు ప్రభాస్.వాస్తవానికి తనకు నచ్చితే ఓకే అంటాడు ఏదైనా, నచ్చకపోతే నిర్మొహమాటంగా దాని నుంచి తప్పుకుంటున్నాడు.
దానికి ప్రస్తుతం ఒక ఉదాహరణ కూడా తెలుసుకుందాం. ప్రశాంత్ కే జి ఎఫ్ సినిమాల తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా తీస్తున్నాడు.
అయితే కేజిఎఫ్ సినిమా తీసిన నిర్మాతలు కాంతారా కూడా తీసి వందల కోట్ల రూపాయలను వెనకేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పుడు సదరు నిర్మాణ సంస్థ ఓనర్ అయిన విజయ్ సౌత్ లో అనేక వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
అందుకే ప్రభాస్ సలార్ కి సీక్వెల్ కూడా ప్లాన్ చేయాలని అప్పుడే తహతలాడిపోతున్నాడు విజయ్ కిరంగదూర్.
కానీ ఇక్కడే అసలు విషయం తేడా కొట్టింది.ఎందుకంటే ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా మొదటి పార్ట్ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు, బాగా ఆలస్యంగా జరుగుతుంది.అప్పుడే సీక్వెల్ అనే ప్రతిపాదన తీసుకురావడం ప్రభాస్ కి నచ్చలేదు.
అందుకే ఇలాంటి మొహమాటానికి పోకుండా నో చెప్పేసాడు.ఇప్పటికే ప్రభాస్ నటించిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి పరాజయం పాలవుతున్నాయి.
అందుకే సీక్వెల్ చేయాలని తొందర ప్రభాస్ కి లేదు.కేవలం హిట్టు కొట్టాలని ధ్యాసతోనే ప్రస్తుతం ప్రభాస్ పని చేస్తున్నాడు.
పైగా సలార్ విజయవంతమై మొదటి భాగం బాగా మార్కెట్లోకి వెళితే అప్పుడు రెండవ పార్ట్ గురించి ఆలోచించవచ్చు అనేది ప్రభాస్ అభిప్రాయం.ఇక ప్రభాస్ కి సలార్ తర్వాత ప్రాజెక్టు కె, స్పిరిట్ సినిమాలో లైన్లో ఉన్నాయి.
రాజా డీలక్స్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.అందుకే ముందున్న సలార్, రాజా డీలక్స్ బాగా నడిస్తేనే తర్వాత వచ్చే ప్రాజెక్టు కే కానీ, స్పిరిట్ సినిమాలు క్లిక్ అయ్యే అవకాశం ఉంది.ఎన్ని వందల కోట్ల డబ్బులు పెట్టినా కూడా ఆది పురుష్ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు.ఎందుకంటే ఇప్పటికే అడ్డగోలు గ్రాఫిక్స్ తో జనాలకు విసుగు పుట్టించే విధంగా ఉన్నాయి ఆది పురుష్ అప్డేట్స్.
కన్నడ హీరో యష్ ప్రశాంత్ నీల్ చెప్పగానే స్టోరీ ఏంటో వినకుండానే కేజిఎఫ్ సినిమాలు చేశాడు.పైగా హోంభలే ఫిలిమ్స్ విజయ్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి.కేజిఎఫ్ పార్ట్ 3 సినిమాతో లింక్ చేయాలని ఆలోచన కూడా ఉన్నట్టుంది.అందుకే ప్రభాస్ ఈ ప్రతిపాదన కి సిద్ధం గా లేడు.