ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు చాలా దేశాలలో అత్యున్నత రాజకీయ స్థానాలను పొందుతున్నారు.తాజాగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే భారతదేశ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హెలి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు సమాచారం ఇచ్చారు.త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.
అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.
మొదటిది ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా.
రెండోది కొత్త లీడర్లు తనే నా అన్నది చూసుకోవడం ఉత్తమమైన పని.ప్రస్తుతం కొత్త నాయకత్వం అవసరం అయింది.నేను ఆ కొత్త లీడర్ కావచ్చు అని ఆమె వెల్లడించింది.అంతే కాకుండా అధ్యక్షుడు బైడెన్ కు కూడా మరో అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు.అమెరికా ను ముందుకు తీసుకెళ్లేందుకు తను కొత్త నాయకురాలు కాగలరని భారతీయ అమెరికన్ రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హెలి గురువారం మీడియా సమక్షంలో వెల్లడించారు.

యునైటెడ్ నేషన్స్ లోని మాజీ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్‌కు రెండో సారి అధికారం లభించకపోవచ్చని కూడా ఆమె అన్నారు.గురువారం ఫాక్స్ న్యూస్ కి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కి 2024 యూస్ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.అక్టోబర్ 2018లో ట్రంప్ పరిపాలన నుంచి హెలి బయటకు వెళ్లిపోయారు.

తను గవర్నర్, అంబాసిడర్ గా చాలా బాగా పనిచేశానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.రెండు అంకెల నిరుద్యోగంతో బాధపడుతున్న రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకొని వచ్చామని చెప్పారు.తను ఎప్పుడూ ఏ పోటీలో ఓడిపోలేదని, అధ్యక్ష ఎన్నికల్లో కూడా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.







