చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర పనులు ప్రారంభం అయ్యాయి.ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించి ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
అయితే, బహిరంగ సభ కోసం కుప్పం – కమతమూరు రోడ్డులో సుమారు 14 ఎకరాల స్థలాన్ని టీడీపీ ఎంపిక చేసింది.పార్కింగ్ కోసం మరో 25 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు నేతలు.
పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా పూజలు చేసి పనులు ప్రారంభించారు.
మరోవైపు నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించలేదు.అదేవిధంగా ఈనెల 23న జీవో నెంబర్.1 ఏపీ హైకోర్టు తదుపరి విచారణ జరగనుంది.







