టీమిండియా బౌలర్ షమీ పై పాక్ అసత్య ప్రచారం చేస్తూ తన దొంగ బుద్ధి చూపించుకుంది.ఐపిసి టి20 ప్రపంచకప్ మ్యాచ్ లో భాగంగా గత ఆదివారం భారత్ – పాకిస్తాన్ తలపడగా టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని దాయాది సులభంగానే చేదించింది.
అయితే బంతికో పరుగు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్ ను కోహ్లీ.మహ్మద్ షమీతో వేయించాడు.
అక్కడ మంచు ఎక్కువ కురవడం, బంతి తడి అవ్వడంతో ఆ ఓవర్లో వరుసగా 6, 4, 4 పరుగులు వచ్చాయి.దీంతో బాబర్ జట్టు విజయం ఖరారయింది.
అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మహమ్మద్ షమీ పై కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.పాక్ కు అననుకూలంగా బౌలింగ్ చేశాడని, ఐఎస్ఐ ఏజెంట్ అంటూ పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
దీంతో టీం ఇండియా మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు.టీమ్ ఇండియా ఓడిపోయినందుకు జట్టు అంతా బాధ్యత వహిస్తుందని, ఒక్కరి పైనే విమర్శలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి.

భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత కీలకమైనది.అయితే దీనిపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే కామెంట్స్ చేస్తున్నట్టు తెలిసింది.మైదానంలో టీమిండియా ఫీల్డింగ్ బాగోలేదని, మ్యాచ్ పూర్తవ్వగానే మైండ్ గేమ్ మొదలు పెట్టారని తెలుస్తుంది.
ప్రాపగాండా డివిజన్ చేసిన ట్వీట్ లో ఈ విషయం వెల్లడైంది.అసలు ‘షమీని నిందించింది ఎవరు.? ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అసత్య ప్రచారమా.? లేక కొంతమంది ఇడియట్స్ పాత్ర ఇందులో ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా షమీపై ట్రోలింగ్ చేసిన కొన్ని ఇన్స్టా హ్యాండిల్స్ ను పరిశీలించగా చాలావరకు బాట్స్ అని తెలిసాయని, మరికొన్ని ఖాతాలలో వివరాలే సరిగ్గా లేకపోవడంతో ఇవి చాలా వరకు పాకిస్తాన్ నుంచే నియంత్రించారని వారు అంటున్నారు.అయితే నిజానిజాలు బయటపడ్డాయి.తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.షమీ పై కామెంట్ చేసిన వారి ఖాతాల్లో చాలా వరకు నిజాలు లేవని, పాక్ కు చెందిన వారు ట్రోలింగ్ కు దిగారని తెలిసింది.దీంతో పాకిస్తాన్ దొంగ బుద్ధి మరోసారి బయటపడిందని, మహ్మద్ షమీ పై ఉద్దేశపూర్వకంగానే ఆన్లైన్ లో దాడిచేసి, మైండ్ గేమ్ తో అసత్య ప్రచారాలకు ఒడిగట్టిందని తెలుస్తుంది.
డివిజన్ చేసిన ట్వీట్ లో ఈ విషయం వెల్లడైంది.అసలు ‘షమీని నిందించింది ఎవరు? ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అసత్య ప్రచారమా.? లేక కొంతమంది ఇడియట్స్ పాత్ర ఇందులో ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా షమీపై ట్రోలింగ్ చేసిన కొన్ని ఇన్స్టా హ్యాండిల్స్ ను పరిశీలించారు.