ఓ మాస్టారు మీ వయస్సు ఏంటి.. చేస్తున్న పని ఏంటి.. సిగ్గుండాలి.. ?

మనుషులకు వయస్సు పెరుగుతుందంటే వయస్సుతో పాటుగా బుద్ది, జ్ఞానం పెరిగిందని అర్ధం.కానీ కొందరు పెద్ద మనుషుల రూపంలో కామాంధుల్లా మారుతున్నారు.

వయస్సు మళ్లిందని జాలి చూపేలా బ్రతకకుండా గుర్రాలైన కోరికలతో పగ్గాలు విడిచి స్వారీ చేస్తున్నారు.అందుకు ఉదహరణగా ఈ 59 ఏళ్ల ఉపాధ్యాయుడిని చెప్పవచ్చూ.పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గురువుగా భావించే వారి వృత్తికే కళంకం.

ఇకపోతే చెన్నైలోని టాప్ స్కూళ్లలో ఒకటైన శేషాద్రి బాల విద్యా భవన్ స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఆన్ లైన్ క్లాసుల బోధన సందర్భంగా పాఠాలు వింటున్న విద్యార్ధినులకు అసభ్య కంటెంట్ ను పంపించడం, మెసేజ్ లు చేయడం వంటివి చేస్తున్నాడని విద్యార్థులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.ఇక విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని, ఈ కామాంధ టీచర్‌ను అరెస్ట్ చేశారట.

Teacher Misconduct In Online Class, Chennai Teacher, Arrested, Sexual Misconduct
మజాకా వల్ల సందీప్ కిషన్ కెరియర్ సెట్ అవుతుందా..?

తాజా వార్తలు