విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచి పథంలో నడిపించాల్సిన గురువు గాడి తప్పి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది.ఇలాంటి కొందరు కీచక గురువులు చేసే పనులతో గురువు అనే పదానికి కళంకం వస్తోంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన ఏలూరు పట్టణంలో కిషోర్ అనే అనే వ్యక్తి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.అయితే ఇతడు పాఠశాలలో చదివేటువంటి విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.
గత కొద్ది రోజులుగా ఈ ఉపాధ్యాయులు ఆగడాలు రోజురోజుకి ఎక్కువవడంతో విద్యార్థునులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు.అయితే నిన్నటి రోజున కూడా ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు.
దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్ళిన బాలికలు ఉపాధ్యాయుడు చేసే చర్యల గురించి తమ తల్లిదండ్రులకు తెలియజేశారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు కిషోర్ ని పిలిపించి విచారించారు.ఈ విచారణలో అతడు బాలికలపై లైంగిక చర్యలకు పాల్పడుతున్న సంగతి రుజువైంది.దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించి అతడిని అరెస్టు చేయించారు.
అలాగే మైనర్ బాలికల పై లైంగిక వేధింపులకు పాల్పడిన టువంటి అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
.