టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబుది 420 విజన్ అని అన్నారు.
అమ్మఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం పథకాలు మీరెందుకు తేలేదని ప్రశ్నించారు.రాజధానిలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
టీడీపీ హయాంలోనే విచ్చలవిడిగా గంజాయి సాగు జరిగిందని ఆరోపించారు.పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయించి జైలుకు వెళ్లలేదా అని నిలదీశారు.
గంజాయి సాగు గురించి టీడీపీ వాళ్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రంలో గంజాయి సాగును సీఎం జగన్ అణచివేస్తున్నారని రోజా వెల్లడించారు.







