మరికొద్ది నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) హోరాహోరీగా ఉండేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా వివిధ పార్టీలలోని కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన జనాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ఎన్నికల్లో కీలక నేతలంతా ఒకరిని ఒకరు ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఒక పార్టీ మరో పార్టీని టార్గెట్ పెట్టుకోవడంతో ముఖ్య నాయకుల గెలుపు పై జనాల్లో ఈ స్థాయిలో ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉంటే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో లోకేష్ 5000 ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) చేతిలో ఓటమి చెందారు.అయినా మళ్లీ ఆ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసినందుకు సిద్ధమని ప్రకటించారు.అయితే లోకేష్ మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri Constituency ) విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం, ఆ నియోజకవర్గ నుంచే గెలిచి తన సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉండడంతో, టిడిపి నేతల్లో టెన్షన్ నెలకొంది.
ఎందుకంటే టిడిపికి( TDP ) మంగళగిరి నియోజకవర్గ అంత సేఫ్ కాదనే విషయం గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ రుజువైంది.1985లోనే మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగిరింది.ఆ తరువాత మళ్లీ ఆ నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరలేదు.దీనికి అనేక కారణాలు ఉన్నాయి.అయితే ఈ నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడం సాహసం గానే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.టిడిపికి తిరుగులేని నియోజకవర్గాలు ఏపీలో చాలానే ఉన్నాయి.
అయినా ఆయన పట్టు బట్టి మళ్ళీ మంగళగిరిలోనే లోకేష్ పోటీ చేసి తనపై వచ్చిన విమర్శలను తిప్పుకొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
ఇక్కడ లోకేష్ ను ఓడించాలనే లక్ష్యంతో అధికార పార్టీ వైసిపి( YCP ) ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డికి టికెట్ నిరాకరించింది.వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసిపి అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని( Ganji Chiranjeevi ) పోటీకి దింపుతోంది .గంజి చిరంజీవి ఇక్కడ బలమైన నేత కావడం, 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి ఆళ్ల రామకృష్ణారెడ్డి పై కేవలం 7 ఓట్ల తేడాతో ఓటమి చెందారు .ఇప్పుడు గంజి చిరంజీవికి వైసిపి టికెట్ ఇస్తున్నాడు లోకేష్ చిరంజీవి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది.