అయినా రిస్క్ చేస్తానంటున్న చినబాబు 

మరికొద్ది నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) హోరాహోరీగా ఉండేలా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా వివిధ పార్టీలలోని కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన జనాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ ఎన్నికల్లో కీలక నేతలంతా ఒకరిని ఒకరు ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఒక పార్టీ మరో పార్టీని టార్గెట్ పెట్టుకోవడంతో ముఖ్య నాయకుల గెలుపు పై జనాల్లో ఈ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

2019 ఎన్నికల్లో లోకేష్ 5000 ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) చేతిలో ఓటమి చెందారు.

అయినా మళ్లీ ఆ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసినందుకు సిద్ధమని ప్రకటించారు.

అయితే లోకేష్ మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri Constituency ) విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం, ఆ నియోజకవర్గ నుంచే గెలిచి తన సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉండడంతో, టిడిపి నేతల్లో టెన్షన్ నెలకొంది.

"""/" / ఎందుకంటే టిడిపికి( TDP ) మంగళగిరి నియోజకవర్గ అంత సేఫ్ కాదనే విషయం గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ రుజువైంది.

1985లోనే మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగిరింది.ఆ తరువాత మళ్లీ ఆ నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరలేదు.

దీనికి అనేక కారణాలు ఉన్నాయి.అయితే ఈ నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడం సాహసం గానే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

టిడిపికి తిరుగులేని నియోజకవర్గాలు ఏపీలో చాలానే ఉన్నాయి.అయినా  ఆయన పట్టు బట్టి మళ్ళీ మంగళగిరిలోనే లోకేష్ పోటీ చేసి తనపై వచ్చిన విమర్శలను తిప్పుకొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

"""/" / ఇక్కడ లోకేష్ ను ఓడించాలనే  లక్ష్యంతో అధికార పార్టీ వైసిపి( YCP ) ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డికి టికెట్ నిరాకరించింది.

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసిపి అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని( Ganji Chiranjeevi ) పోటీకి దింపుతోంది .

గంజి చిరంజీవి ఇక్కడ బలమైన నేత కావడం, 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి ఆళ్ల రామకృష్ణారెడ్డి పై కేవలం 7 ఓట్ల తేడాతో ఓటమి చెందారు .

ఇప్పుడు గంజి చిరంజీవికి వైసిపి టికెట్ ఇస్తున్నాడు లోకేష్ చిరంజీవి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది.

ఇప్పటికీ నాకు గౌరవం దక్కలేదు… అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు!