పవన్ పై గుంటూరు ఎంపీ ఘాటు వ్యాఖ్యలు     2017-12-09   21:36:11  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ కి తిక్క ఎక్కువ అని తనకి తానూ చాలా సందర్భాలలో చెప్పుకున్నాడు..ఆ డైలాగు పెద్ద సెన్సేషన్ అయ్యింది కూడా అయితే..మరీ తిక్క ఎక్కువ అవుతోంది ఈ మధ్య అంటున్నారు కొంతమంది నేతలు.. తన స్వరంతో జనాలని ఊర్రుతలు ఊగిస్తూ ఉంటాడు…కానీ ఏమి చెప్తాడో ఎవరికీ అర్థం కాదు..ఒక్క అరుపు అరిస్తే చాలు జనాల అల్లర్లు చప్పట్లతో హాలు మారు మోగిపోతుంది..కానీ చప్పట్లు కొట్టిన ఒక్కళ్ళకి కూడా అసలు పవన్ ఏమి చెప్పాడో తెలియదు..కానీ అదొక అభిమానం అంతే..అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకుంటున్నాడు అనేది జగమెరిగిన వాస్తవం..ఎంత తెలివైన వాడు కాకపొతే సభకి వచ్చిన జనాలు సైలెంట్ అవుతుంటే రాసుకున్న తన స్క్రిప్ట్ పక్క దారి పోతుంటే మహనీయులు రాసిన ఒక డైలాగుని గావు కేకలు పెడుతూ అందరిలో హీట్ పుట్టిస్తాడు చెప్పండి అంటూ రాజకీయ నాయకులు సెటైర్స్ మీద సెటైర్స్ వేసుకుంటున్నారు.

అయితే సామాన్య మనిషికి ఎటువంటి సందేహాలు ఉన్నాయో అవే ఇప్పుడు టిడిపి గుంటూరు ఎంపీ గల్లా జగదేవ్ కి ఉన్నాయి…అందరిలా గమ్మున ఉండకుండా తన సందేహాలని అడి(కడి)గేశారు కూడా…మేము అంతా ఒక్కటే అంటుంటే నవ్వుతు కొన్ని పంచ్ డైలాగులు పేల్చేశారు..ఇన్ని రోజులు ఉపన్యాసాలు విన్నాక కూడా పవన్ పొలిటికల్ స్టాండ్ ఏమిటో అర్థంకాలేదు, అని జయదేవ్ అన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో నాకు అంతగా పరిచయం లేదు అయితే..అయితే నేను ఆయనని ప్రజారాజ్యం నుంచీ ఫాలో అవుతుంటే ఉన్నాను అయితే ఆయన ఆలోచన,తీరు అంతా బాగుంటుంది.. కాకపోతే ఆయన పొలిటికల్‌ స్టాండ్‌ ఏమిటో అర్థం కావడం లేదు’ అని గుంటూరులో జయదేవ్‌ అన్నారు. ఇప్పటికి టిడిపి పవన్‌ను మిత్రుడిగానే భావిస్తన్నదని , భవిష్యత్‌లో ఆయనతో స్నేహం కొనసాగాలని తాము కోరుకుంటున్నాము అని ఒక పక్క దెప్పి పొడుస్తూనే మరోపక్క చురకలు అంటిస్తునే..మా వాడు మా వాడు అంటూ గల్లా పవన్ ని పొగిడారు..అయితే ఇప్పుడు గల్లా మాటలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. కత్తి మహేష్ అన్న మాటల కంటే కూడా ఇప్పుడు గల్లా మాటలు చాలా ఘాటుగానే ఉన్నాయి..ఎంతన్నా గుంటూరు ఎంపీ కదా.