టీడీపీని వెంటాడుతున్న 'నాని' భయం .. రచ్చ తప్పదా ? 

ఏ పార్టీకైనా ఎన్నికల సమయంలో తీవ్ర ఒడిదుడుకులు సహజం.పార్టీలో టికెట్ దక్కిన వారు అలక చెంది పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.

ఇవన్నీ సర్వసాధారణంగా ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి.ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఈ రకమైన రచ్చ జరుగుతుంది.

పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి,  కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు జగన్( CM ys jagan ) ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే ఒక విడత జాబితాను ప్రకటించారు.

మరో విడత జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.దీంతో టిక్కెట్ దక్కని వారంతా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.

Advertisement

ఇది కేవలం ఒక్క అధికార పార్టీ వైసీపీకే పరిమితం కాదు.రేపు టిడిపి అభ్యర్థుల జాబితా ప్రకటించినా,  ఆ పార్టీలోనూ టిక్కెట్ దక్కని నేతలు అసంతృప్తికి గురై పార్టీపై విమర్శలు చేయడంతో పాటు,  ఇతర పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు.

ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు.ఇది ఇలా ఉంటే .విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న టిడిపి ఎంపీ కేశినేని నాని( Kesineni nani ) వ్యవహారం ఆ పార్టీలో చాలా కాలంగా హాట్ టాపిక్ గానే మారింది .పార్టీ అధిష్టానం ను లెక్కచేయనట్లుగానే నాని వ్యవహరిస్తూ ఉండడం తో,  ప్రత్యామ్నాయంగా నాని సోదరుడు కేశినేని చిన్నిని టిడిపి అధిష్టానం ప్రోత్సహిస్తూ వస్తోంది.వచ్చే ఎన్నికల్లో విజయవాడ( Vijayawada ) ఎంపీ సీటు కేశినేని చిన్నికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

అయితే నాని మాత్రం తానే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానంటూ ప్రకటించడంతో , ఈ విషయంలో రచ్చ తప్పదనే సంకేతాలు వెలబడుతున్నాయి.కేసునేని చిన్నికి నారా లోకేష్ ఆశీస్సులు ఉండడంతో,  కచ్చితంగా ఆయనకు టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.2014 , 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా నాని టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు .

వచ్చే ఎన్నికల్లోను పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో నాని ఉండగా,  ఆయనకు టిడిపిలో టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది.దీనికి కారణం రెండోసారి ఎంపీ అయిన తర్వాత నాని టిడిపి( TDP ) అధిష్టానాన్ని పట్టించుకోనట్టుగా వ్యవహరించడంతో పాటు,  అప్పుడప్పుడు సంచలన విమర్శలు చేయడం, తన లోక్ సభ పరిధిలోని టిడిపి కీలక నాయకులతో ఆయనకు తీవ్రస్థాయిలో విభేదాలు ఉండడం తో,  నానిని తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.దీనికి తగ్గట్లుగానే కేశినేని నాని తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ స్థానాల్లో సొంతంగా తన గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో వైసిపి ఎమ్మెల్యేలకు ఎంపీ లాట్స్ నిధులను కేటాయిస్తూ ఉండడం వంటివి ఆయనపై టిడిపి అధిష్టానానికి అనుమానాలు పెరిగేలా చేస్తున్నాయి.అయితే నానికి టికెట్ కేటాయించకుండా,  తన సోదరుడు చిన్నికి ఎంపీ సీటు ఇస్తే టిడిపికి నాని చేసే నష్టం చాలా ఎక్కువగానే ఉంటుందనే టెన్షన్ టిడిపి అధిష్టానం లో ఉంది.

Advertisement

తాజా వార్తలు