వైసీపీ ఆగడాలు భరించలేమంటూ కడప జిల్లా ఎస్పీని ఆశ్రయించిన టీడీపీ ఎమ్మెల్సీ.. !!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప జిల్లాలో వైసీపీ నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికల నేపధ్యంలో టీడీపీ మద్దతుదారులను, ఓటర్లను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారి దౌర్జనాలకు అడ్డుకట్ట వేయాలని బీటెక్ రవి, ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు.ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పైడిపాళెం, పెద్ద జూటూరు, మల్లేల, దుగ్గన్నగారిపల్లె తదితర పంచాయతీల్లో వైసీపీ నేతల అరచకాలకు అడ్దు లేకుండా పోతుందని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

అదీగాక కొందరు వైసీపీ నేతలు ఏకగ్రీవాల కోసం ఒత్తిళ్లకు గురిచేస్తూ, టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతు మానసికంగా హింసిస్తున్నారంటూ పేర్కొన్నారు.ఇక తమ మాట వినని వారి పంటలు ధ్వంసం చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని వెల్లడించారు.

అయితే జిల్లా ఎస్పీ అన్బురాజన్ తమ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించి, షాడో బృందాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని బీటెక్ రవి తెలిపారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు