ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని, ఇప్పటికే విదేశాల్లోని 70 ప్రదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు చెప్పారు.శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అశోక్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,
ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.
మహానాడు కార్యక్రమానికి రాజమండ్రిలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ ఏడాది లక్షలాది ప్రజల మధ్య మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.విగ్రహాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేంద్రం చట్టం తీసుకుని రావాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.