సంయుక్త మీనన్( Samyuktha Menon ).ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన పేరు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమాలో రానా భార్య పాత్రలో నటించిన సంయుక్త మీనన్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అనంతరం ఈమె కళ్యాణ్ రామ్(Kalyan ram) హీరోగా నటించిన బింబిసారా( Bimbisara ) ,ధనుష్ ( Danush )హీరోగా నటించిన సార్(Sir) సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ( Virupaksha Movie ) తో మరొక హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో ఈమె ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అంటూ ఈమెపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీకి సంయుక్త గోల్డెన్ లెగ్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందించిన సంయుక్త ఈ వార్తలను పూర్తిగా కొట్టి పారేశారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఇలా మంచి సక్సెస్ అందుకుంటున్నాను అంటే అందుకు గల కారణం అదృష్టం( Luck) కాదని తాను ఎప్పుడూ కూడా తన లక్ ను నమ్ముకోనని సంయుక్త తెలియజేశారు.ఒక సినిమా విజయం అయింది అంటే అది కేవలం నా లక్ వల్ల మాత్రం కాదు.
విజయం అనేది ఎప్పుడూ కూడా మన టాలెంట్ అలాగే స్క్రిప్ట్ ఎంపిక విషయంపైనే ఆధారపడి ఉంటుందని ఈమె తెలియజేశారు.

ఇలా తాను ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి ఇదే కారణమని ఈ సందర్భంగా సంయుక్త మీనన్ తన సినీ సక్సెస్ సీక్రెట్ బయటపెట్టారు.ఇక ఈమె ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ ( Devil ) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇక సంయుక్తకు ఒంటరిగా ఉండటం ఇష్టమట.
అందరిలా కాళీ దొరికితే ఫ్రెండ్స్ ని పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరట.ఖాళీ సమయం దొరికితే అందమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటూ ఉంటానని తన అలవాట్ల గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.







