Atchannaidu : ఇక టీడీపీ జనసేన ఇసుక నిరసనలు !

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది ఇప్పటివరకు అనేక అంశాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన టిడిపి( TDP ) ఇసుక అక్రమ దోపిడీ వ్యవహారంపై జనసేన తో కలిసి త్వరలోనే పోరాటం చేపట్టేందుకు సిద్ధం అవుతోంది.

వాస్తవంగా టిడిపి జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై వరుసగా పోరాటాలు చేపట్టాలని నిర్ణయించారు.

  ఇప్పటికే కొన్ని అంశాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టగా,  తాజాగా ఇసుక వ్యవహారం పైన పోరాటం చేసి ప్రజల్లో వైసిపి ప్రభుత్వ గ్రాఫ్ తగ్గించాలనే లక్ష్యంతో టీడీపీ,  జనసేనలు ఉన్నాయి .దీనిలో భాగంగానే ఇసుక అక్రమాలపై పోరాడేందుకు ఈ రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

 ఈ మేరకు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు( Acham naidu ) ఈ వ్యవహారంపై మాట్లాడారు.ఇసుక అక్రమ దోపిడీ వ్యవహారంపై టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని అచ్చెన్న నాయుడు తెలిపారు.  వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని అచ్చెన్న మండిపడ్డారు.

ఇసుక మాఫియాతో సీఎం జగన్( CM Jagan ) ఐదేళ్లలో 50వేల కోట్లు లూటీ చేశారని సంచలన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని తేలుస్తూ,  వాటికి సంబంధించిన ఫోటోలు నకిలీ బిల్లుల పుస్తకాలు తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది.

Advertisement

 అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడీ మాత్రం ఆపడం లేదు .రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500 కి పైగా ఇసుక రీచ్ లలో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ,అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని టిడిపి , జనసేన ల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తుంది.దీనిలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు ఇసుక రీచ్ ల వద్ద నిరసనలు తెలియజేస్తాం .వైసిపి అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫోటోలు సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతాం అంటూ అచ్చెన్న ప్రకటించారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు