జనసేన అభ్యర్థులకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పిన పవన్ ! 

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు .టిడిపి , జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Tdp, Janasena, Janasenani, Pavan Kalyan, Jagan, Chandrababu, Cbn, Ap Elections,-TeluguStop.com

పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.దీంతో పాటు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ,  పార్టీ నాయకులకు నిర్దేశం చేస్తున్నారు.

మొన్నటి వరకు వారాహి యాత్ర పేరుతో ఏపీలో పర్యటించిన పవన్ ఆ తర్వాత చాలా రోజులుగా విరామం ప్రకటించారు.  అయితే ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో,  పార్టీ కీలక నేతలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా టిడిపి జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని టిడిపిని ఎవరు విమర్శించవద్దని పవన్ చెబుతున్నారు.

తన వ్యూహాన్ని పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని,  తనతో విభేదించేవారు పార్టీ నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెబుతున్నారు.

తాజాగా పార్టీ కీలక నాయకులతో పవన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్లుగా ఈసారి కేటాయించమని,  గతంలో ఉదాసీనంగా వ్యవహరించామని,  కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదని క్లారిటీ ఇచ్చారు .టికెట్లు ఆశించే అభ్యర్థి వ్యక్తిగతంగా కనీసం 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకునే సామర్థ్యం కలిగి ఉండాలని ,అలా ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని పవన్ తేల్చి చెప్పారు.టిడిపి నేతలతో పార్టీ శ్రేణులు సఖ్యతగా మెలగాలని , టిడిపి తో సయోధ్యతో ప్రయాణం చేసిన వారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan-Politics

తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని , కానీ అందులో వాస్తవం లేదని,  ఎన్నికల కమిషన్ 40 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఇస్తుంటే తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎలా చేస్తానని పార్టీ ముఖ్య నాయకులతో పవన్ అన్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి టిడిపి , జనసేన ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేయాలని పవన్ దిశ నిర్దేశం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube