జనసేన లో టీడీపీ కోవర్ట్...? ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ సంచలన ఆరోపణలు

రాంగోపాల్ వర్మ ఎప్పుడూ… ఏదో ఒక వివాదాన్ని వెతుక్కుంటూనే ఉంటాడు.ఏదో ఒక వివాదం లేకపోతే వర్మకు నిద్ర పట్టదో ఏంటో కానీ… తనకు సంబంధం ఉన్న… లేకపోయినా మాత్రం అన్ని విషయాల్లోనూ వర్మ దూరేస్తుంటాడు.

 Tdp Covert In Janasena Rgv Sensetional Allegations On Twitter-TeluguStop.com

ఇప్పుడు ఆయన జనసేన మీద తన ఫోకస్ పెట్టాడు.దీనిలో భాగంగా….

జనసేనలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ మీద దృష్టిపెట్టాడు.ప్రస్తుతం ఆయనకు ఆ పార్టీలో ఎక్కడలేని ప్రాధాన్యత లభిస్తోంది.

వేదికల మీద పవన్‌ కల్యాణ్ తో పాటు సమానంగా కుర్చునే అవకాశం జనసేనలో నాదెండ్లకు లభిస్తోంది.ఈ పరిణామం ఆ పార్టీలో చాలా మందికి రుచించడంలేదు.

ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.పవన్‌ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడవబోతున్నారని వర్మ వరుసగా ట్వీట్లు చేశారు.పవన్‌కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారన్న దానిపై తనకు పక్కా సమాచారం ఉందని వర్మ చెప్పారు.పవన్‌ కల్యాణ్ అభిమానిగా మనోహర్ పొడిచే వెన్నుపోటు నుంచి పవన్‌ కల్యాణ్‌ను రక్షించాల్సిందిగా భగవంతుడు బాలాజీని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

ఎన్టీఆర్‌కు నాదెండ్ల మనోహర్ తండ్రి వెన్నుపోటు పొడిచినట్టుగానే… మనోహర్‌ కూడా పవన్‌కు వెన్నుపోటు పొడవబోతున్నారని.దీనిపై పవన్‌ను ఆయన ఫ్యాన్స్‌ అప్రమత్తం చేయాలని కోరారు.

ప్రస్తుతం పవన్‌ పక్కన మనోహర్‌ ఎలా నిలబడ్డారో.అప్పట్లో ఎన్టీఆర్‌ పక్కన కూడా నాదెండ్ల భాస్కరరావు అలాగే నిలబడేవారని వర్మ వివరించారు.పవన్ ఎంత పెద్ద స్టార్ అయినా వెన్నుపోటు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదన్నారు.అలా వెన్నుపోటు నుంచి తప్పించుకోవడం ఎన్టీఆర్ వల్లే కాలేదన్నారు.పవన్‌ ప్రజల కోసం ముందు వరుసలో నిలబడి పోరాటం చేస్తుంటే నాదెండ్ల మనోహర్ వెనుక నిలబడి వెన్నుపోటు పొడుస్తారని వర్మ హెచ్చరించారు.జనసేనలో పవన్‌కు వెన్నుపోటు పొడిచేందుకు జరుగుతున్న కుట్రల గురించి తన వద్ద పక్కా సమాచారం ఉందని వర్మ బాంబ్ పేల్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube