తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఓ విషయమై పార్టీ సీనియర్ నాయకులు మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే ఈ విషయమై నాయకులు భిన్న విధాలుగా స్పందిస్తున్నారు.
ముఖ్యంగా చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా బాధ్యతలు స్వీకరించే నారా లోకేష్ ఈ విషయమై ఎప్పటి నుంచో నాయకుల మధ్య చర్చలు మొదలయ్యాయి.వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టి తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ఇప్పుడు అధికారంలోకి వచ్చారు.
లోకేష్ కూడా చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రథసారథి గా ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే అర్హత లోకేష్ ఉన్నాయనేది చంద్రబాబు ముందు నుంచి అనుకుంటూ వస్తున్నా, ఈ విషయమే.
చంద్రబాబు తన తరువాత ఆ స్థాయిలో లోకేష్ ను నిలబెడతామని చూసినా, ఆయన మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఐదు శాఖలను నిర్వహించిన లోకేష్ పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించలేకపోయారు.అంతేకాకుండా 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు.దీంతో లోకేష్ పై అందరికీ సందేహాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు.ఒకవేళ శాసన మండలి రద్దు అయితే లోకేష్ కు ఏ పదవి ఉండదు.
అది కాకుండా పార్టీ నాయకులు చాలామందికి లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేదు.ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించినా, 2024 లో సీఎం అభ్యర్థిగా ప్రకటించినా, పార్టీ ఘోర ఓటమి చెందుతుందనేది అందరిలో ఉన్న అభిప్రాయం.
ఒకవేళ 2024 లోనూ చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఉన్నా ఆయన ఇప్పుడే 70 సంవత్సరాలు వచ్చేశాయి.

అదీ కాకుండా ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.దీంతో 2024 లో సీఎం అభ్యర్థిగా తాను తెరపై కనిపించినా, ఫలితాలు తర్వాత లోకేష్ కు సీఎం బాధ్యతలు అప్పగించి తాను తెర వెనుక ఉండాలని, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంలో పార్టీ సీనియర్లు లోకేష్ కు మద్దతు పలుకుతారా అనేది అనుమానంగానే కనిపిస్తోంది.
సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు వంటి వారు మాత్రమే లోకేష్ నాయకత్వానికి మద్దతు పలుకుతుండగా, యనమల రామకృష్ణుడు వంటివారు లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.అంటే తమ కంటే బాగా జూనియర్ అయిన వ్యక్తి సారథ్యంలో తాము పనిచేయాలా అన్నట్లుగ సీనియర్ నాయకులు వ్యవహారం ఉందట.2024 సమయానికి లోకేష్ తన సామర్ధ్యాన్ని నిరూపించుకోగలిగితే ఆయనకు పార్టీ నుంచి, ప్రజల నుంచి మద్దతు ఉంటుంది.లేకపోతే లోకేష్ తో పాటు టీడీపీ రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా నే మారుతుంది.