జీహెచ్ఎంసీ పై సుప్రీం కోర్టుకు మిత్రులు?

గ్రేటర్ హైదారాబాదు మునిసిపల్ కార్పోరేషన్ పై సుప్రీం కోర్టులో కేసు వేయాలని మిత్రులు ఆలోచిస్తున్నారట.ఎవరీ మిత్రులు? వీరు వ్యక్తులు కారు.టీడీపీ, బీజేపీ పార్టీలు.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ఆశలు నెరవేరలేదు.కాబట్టి ఈ రెండు పార్టీలు రాబోయే హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నాయి.ఈ పార్టీలు సుప్రీం కోర్టులో ఎందుకు కేసు వేయాలని నిర్ణయించుకున్నాయి? నగర పాలక సంస్థ పరిధిలో వార్డుల విభజనను ఈ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.బీసీ ఓటర్ల నమోదు సరిగా జరగలేదని, ఓటర్ల జాబితాల నుంచి చాలామంది ఓటర్ల పేర్లు తీసి వేశారని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఈ అవకతవల మీద సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నాయి.

 Tdp-bjp To File Petition Against Ghmc-TeluguStop.com

నగరంలో వార్డుల విభజన అధికార గులాబీ పార్టీకి, ఎం ఐ ఎం పార్టీకి అనుకూలంగా జరిగిందని పసుపు, కాషాయం పార్టీలు ఆరోపిస్తున్నాయి.మేయర్ పదవిని చేజిక్కించు కోవడానికి అధికార పార్టీ కుట్ర పన్నుతున్నదని బీజేపీ ఆరోపిస్తోంది.

నగర పాలక సంస్థ ఎన్నికలు జనవరిలో జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో కారు పార్టీని గెలవనివ్వకూడదని ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube