వైసీపీ నేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఎంతవరకు విజయం సాధిస్తుందో బీజేపీ అధిష్టానానికి క్లారిటీ ఉందన్నారు.
టీడీపీ మీద కమలం పార్టీ ఎటువంటి ఆశలు పెట్టుకోలేదని పేర్కొన్నారు.కనీసం ఒక్క స్థానంలోనైనా టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పినా నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
ఈ సారి ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుందని తెలిపారు.మహారాష్ట్ర సీఎం షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ, ఎన్సీపీ, జేడీయూ, ఎల్జేపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు మొత్తం 30 లోక్ సభ సీట్లు వస్తాయని బీజేపీ అధిష్టానం భావిస్తోందన్నారు.
అయితే ఇందులో టీడీపీ, జనసేన వాటా సున్నా అని ఆయన ఎద్దేవా చేశారు.







