Underwater Hotel : వీడియో: అత్యంత ఖరీదైన ఈ అండర్‌వాటర్ హోటల్ చూశారా..

ట్రావెలర్స్ తరచుగా అండర్‌వాటర్ వరల్డ్‌కి ఆకర్షితులవుతారు.కొందరు సముద్ర గర్భాల్లోకి డైవింగ్ చేయడం ఆనందిస్తారు, మరికొందరు నీటి అడుగున సాహసాల వీడియోలను చూడటానికి ఇష్టపడతారు.

 Viral Video Of The Muraka Underwater Hotel-TeluguStop.com

అయితే ఇటీవల ఒక ట్రావెలర్స్ జంట అండర్‌వాటర్ హోటల్‌కు వెళ్లారు.అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అండర్‌వాటర్ హోటల్( Underwater Hotel ) అట.ఆ జంట ఈ హోటల్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ఆన్‌లైన్‌లో ఆల్రెడీ పాపులర్ అయిన ఈ జంట మాల్దీవుల్లోని ఓ లగ్జరీ హోటల్‌లో తాము పొందిన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా పంచుకున్నారు.వీడియోలో సముద్ర మట్టానికి దిగువన ఉన్న వారి అసాధారణ గది, సముద్రం కింద నివసించే ప్రత్యేక అనుభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది.

సముద్రంలోకి దిగే ప్రైవేట్ ఎలివేటర్( Private Elevator ) ద్వారా వారు రూమ్‌కు వెళ్లారు.

ఎలివేటర్ నుంచి ఎగ్జిట్ అయ్యాక వారు ఒక అందమైన బెడ్ రూమ్‌కు దారితీసే కారిడార్ గుండా నడుస్తారు.ఆ గదిలో పెద్ద, సౌకర్యవంతమైన బెడ్, చక్కగా అమర్చబడిన సౌకర్యాలు, హాయిగా కూర్చునే ప్రదేశం, హైటెక్ బాత్రూమ్, పైన సముద్ర జీవితాన్ని అందించే గ్లాస్ వ్యూ( Glass View 0 కనిపించాయి.పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియోకు 8 కోట్ల దాకా వ్యూస్ వచ్చాయి.ఇది మిలియన్ల కొద్దీ లైక్‌లతో చాలా పాపులర్ అయ్యింది.అలానే ఇది నెటిజన్ల మధ్య చాలా చర్చలకు దారితీసింది.చాలామంది హోటల్ విలాసానికి ఆకర్షితులవుతుండగా, మరికొందరు నీటి అడుగున నిద్రపోవాలనే ఆలోచన భయంకరంగా ఉండదా అని సందేహిస్తున్నారు.రాత్రిపూట సముద్రంలో దాగి ఉన్న వింత జీవులు దాడి చేస్తే పరిస్థితి ఏంటని కొంతమంది భయం వ్యక్తం చేశారు.

మరికొందరు అలాంటి గదుల్లో నిద్రపోతున్నప్పుడు నరాలు తెగే విధంగా అనుభూతి కలుగుతుందని వివరించారు.అండర్ వాటర్ లివింగ్ అనే కాన్సెప్ట్ ని తమకు నచ్చలేదని మరికొందరి పేర్కొన్నారు.ది మురాకా( The Muraka ) అనే పేరుగల ఈ హోటల్ కాన్రాడ్ మాల్దీవుల రంగాలి ఐలాండ్ రిసార్ట్‌లో భాగం.ఇది సముద్ర ఉపరితలం నుండి 16 అడుగుల కింద ఉన్నది.

ఇదొక టు లెవెల్ బిల్డింగ్.ది మురాకా కస్టమర్లకు వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్, స్పా, ప్రైవేట్ ఫిట్‌నెస్ ట్రైనర్, బట్లర్, చెఫ్‌ వంటి వారితో పాటు అన్ని ప్రత్యేక సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube