మొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకున్న టీఆర్ఎస్, బీజేపీ ప్రస్తుతం ఉప్పు, నిప్పులా తయారయ్యాయి.ఒకరిని ఇరుకున పెట్టేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని తప్పుపట్టిన సీఎం కేసీఆర్.అప్పటి నుంచి కేంద్రంతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ఇక తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు కేసీఆర్.అప్పటి నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.
రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రధాని హాజరైన రోజు సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.అప్పటి నుంచి ఈ పార్టీల మధ్య దూరం ఇంకా పెరిగింది.
ప్రధాని మోడీని దేశం నుంచి తరిమేయాలని వంటి సంచలన వ్యాఖ్యలను చేశారు సీఎం కేసీఆర్.కేంద్రంపై పోరాడేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్కటి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం బీజేపీ టార్గెట్ చేశారు.
తాజాగా మేడారం జాతరకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు.
ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ప్రొటోకాల్ పాటించలేదు.ఈ విషయాన్ని దృష్టి మళ్లించేందుకు ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారంటూ టీఆర్ఎస్ అనుకూల మీడియాను టార్గెట్ చేసింది బీజేపీ.
గవర్నర్ మేడారం జాతరకు వెళ్లిన సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్ వచ్చిన సమయంలో జిల్లా ఉన్నతాధికారులు అక్కడే ఉండాలి.
కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.దీంతో ప్రొటోకాల్ విషయమై పీఎం కార్యాలయానికి గవర్నర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ విషయం సీరియస్ అవుతుందని భావించిన సీఎస్ సోమేశ్ కుమార్ ముందుగానే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేశారు.మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతోనే ఉన్నతాధికారులు గవర్నర్ కార్యక్రమంలో లేరని కొందరు ఆరోపిస్తున్నారు.
మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.ఎలాగో టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు కాబట్టి తప్పనిసరిగా కాస్త సీరియస్ గానే కేంద్రం పెద్దలు వ్యవహరిస్తారని టాక్.