తారకరత్న పుట్టినరోజు... ఎమోషనల్ పోస్ట్ చేసిన భార్య అలేఖ్య రెడ్డి?

నందమూరి తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇలా తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా అభిమానులు, చిత్ర పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృతి కౌగిలిలో బందీ అయినటువంటి తారకరత్న మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులను ఎంతగానో కృంగదీస్తోంది.ఈ విధంగా తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

అయితే ఈయన పుట్టినరోజుకు కేవలం మూడు రోజుల ముందు తారకరత్న మరణించడంతో ఈ విషయం కుటుంబ సభ్యులను మరింతగా బాధిస్తోంది.

ఈ క్రమంలోనే తారకరత్న ఫిబ్రవరి 22వ తేదీ 40 పుట్టిన రోజు కావడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా తారకరత్నను తాను చాలా మిస్ అవుతున్నాను అంటూ చేసినటువంటి పోస్ట్ అందరిని కంటతడి పెట్టిస్తోంది.తారకరత్న మరణించిన మూడు రోజులకే ఆయన పుట్టినరోజు రావడంతో అలేఖ్య రెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా తన పెద్ద కుమార్తె నిష్కతో తారకరత్న కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ నా జీవితంలో ఉత్తమ తండ్రి.ఉత్తమ భర్త అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Advertisement

హ్యాపీ బర్త్ డే.నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఈమె ఎమోషనల్ అవుతూ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు అలేఖ్య పోస్ట్ చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే మిస్ యు సో మచ్ అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈయన పుట్టినరోజు నాడే తన చిన్న కర్మ కూడా కావడంతో అలేఖ్య ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఏకధాటిగా తన చిన్న కర్మలో కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా ఈమె ఏడుస్తూ ఉండడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

ప్రస్తుతం అలేఖ్య రెడ్డి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు