తల్లి అయిన హీరోయిన్‌

‘ఝుమ్మంది నాధం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి తన అందాలతో మైమరపించింది.

ఈ అమ్మడు ఆ తర్వాత కూడా మంచి ఆఫర్లను దక్కించుకున్నప్పటికి పెద్దగా సక్సెస్‌లు రాకపోవడంతో ఈమె మెల్లగా ఫేడ్‌ అవుట్‌ అవుతూ వచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడికి కోలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు లేవు.ఇక ఈ సమయంలో ఈ అమ్మడు బాబుకు జన్మనిచ్చిందనే వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

తాప్సి గత కొంత కాలంగా బ్యాడ్మింటన్‌ ఆటగాడు మాథ్యూబోకుతో సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ముంబైలోని ప్రముఖులు ఉండే ఏరియాలో వీరిద్దరు ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఆ సహజీవన ఫలమే ఇప్పుడు బాబు అని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.అందుకే తాప్సి గత కొన్ని నెలలుగా సినిమాలను ఒప్పుకోకుండా, మీడియాకు కనిపించకుండా దూరంగా ఉంటోంది అంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే ఈ వార్తలను తాప్సి కొట్టి పారేసింది.తాను తల్లిని కావడం ఏంటని నవ్వుతోంది.

అసలు మాథ్యూతో తాను సహజీవనం చేయడం ఏంటిని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.మాట్లాడకుండా ఉంటే తల్లిని చేస్తారా అంటూ మీడియా వారిని ప్రశ్నిస్తోంది.

మొత్తానికి తాప్సి తన ప్రమేయం లేకుండానే తల్లి అయ్యింది.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు