తానా ప్రపంచ సాహిత్య వేదిక కథల పోటీ...ఆఖరు తేదీ ఎప్పుడంటే...!!

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) గురించి తెలియని తెలుగు వారు ఉండరు.

అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు భాష కోసం, తెలుగు వారి అభివృద్ధి, వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ.

ప్రపంచంలో అతి పెద్ద తెలుగు సంఘంగా తానా ఎంతో ప్రఖ్యాతి సాధించింది.అమెరికాలో తెలుగు కుటుంబాల పిల్లలకు తెలుగును నేర్పడం మొదలు తెలుగు పండుగలు, తెలుగు భాషపై పట్టు పెంచేందుకు కథలు, రచనల పోటీలు, నాటకాలు, పద్యాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తోంది.

తాజాగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కధల పోటీకి ఆహ్వానం పలుకుతోంది.ఈ కథలు పోటీకోసం భారత దేశపు రక్షణ, రైతులు, పల్లెలు, భారత దేశ సమగ్రత, సామాజిక భాద్యత, చదువు ఇలా ఏ సామాజిక అంశాన్నయినా ఎంచుకోవచ్చు.

అయితే కథలు పంపే వారికి కొన్ని షరతులు విధించింది తానా.రచయిత పంపే కథలు స్వీయంగా రచించినవి అయి ఉండాలి.

Advertisement

అవి ఎక్కడా ప్రచురించి ఉండకూడదు.ఈ కథలు తాము రచించినవే అనే హామీ పత్రంకూడా రచనలతో జత చేర్చాలి.

ఇక రచయిత పూర్తి చిరునామా, వాట్సప్ నెంబర్ కూడా పంపాలి.కథలను పంపే ముందు కథ యూనిక్ కోడ్ లో కానీ లేదంటే చేతి వ్రాతతో కానీ, ఉండాలి అది కూడా A4 పేపర్ సైజ్ లో Pdf , jpeg , word ఫార్మాట్ లలో ఉండాలి.

వీటిని +91 9121081595 నెంబర్ కి పంపవచ్చు.కథలు అందాల్సిన చివరి తేదీ ఏప్రియల్ 2 -2022.

తానాకు ఈ కథలు మొత్తం అందిన తరువాత 22,23,24 తేదీలలో జరిగే కథ వికాసం అంతర్జాల కార్యక్రమంలో రచయితలూ స్వయంగా పాల్గొని కథను చదివి వినిపించవచ్చు.మూడు రోజుల తరువాత ఉత్తమ కథలను నిర్ణయిస్తారు.ప్రతీ ఉత్తమ కథకు రూ.5 వేలు తో పాటు ప్రశంసాపత్రం అందించడం జరుగుతుంది.ఇలా 20 ఉత్తమ కథలను ఎంపిక చేయనున్నట్లుగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు వెల్లడించారు.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

మరిన్ని వివరాలకోసం +91 9121081595 నెంబర్ ను సంప్రదించవచ్చు.

Advertisement

తాజా వార్తలు