ఆ రాష్ట్రంలో అన్ని కాలేజీలు క్లోజ్..!!

దేశంలో కరోనా మళ్లీ విలయ తాండవం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి.

చాలా రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా పెరుగుతుండటంతో కేంద్రం కూడా అలర్ట్ అవుతూ ఉంది.

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఇదే తరుణంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరిపించాలని పేర్కొంది.

పరిస్థితి ఇలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భయంకరంగా పెరిగిపోతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు మరియు కాలేజీలు క్లోజ్ చేయటానికి నిర్ణయం తీసుకుంది.త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరోపక్క మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ అప్పుడప్పుడు అమలు చేస్తూ రాత్రిపూట కర్ఫ్యూ లు విధిస్తూ ఉన్నాయి.పరిస్థితి ఇలా ఉండగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది ఉండటంతో సెకండ్ వేవ్ గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు