నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.సంక్రాంతికి విడుదల కాబోతున్న వీర సింహారెడ్డి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే బాలకృష్ణ తన తదుపరి సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.
బాలయ్య తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే.ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 సినిమా లతో అనిల్ రావిపూడి దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు.
మహేష్ బాబు తో సరి లేరు నీకెవ్వరు సినిమా ను కూడా తెరకెక్కించి సక్సెస్ ను దక్కించుకున్నాడు.ఇలాంటి అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య సినిమా అంటే అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండబోతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈ సమయంలోనే సినిమా లో తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.శరత్ కుమార్ ఈమధ్య కాలంలో తెలుగు లో చాలా సినిమాలు చేస్తున్నాడు.విలన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న శరత్ కుమార్ తాజాగా బాలయ్య సినిమా లో నటించేందుకు ఓకే చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య సినిమా లో శరత్ కుమార్ విలన్ అయితే అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో బాలయ్య యొక్క సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తప్పకుండా ఈ సినిమా అలరిస్తుందని అంటున్నారు.ఇప్పటి వరకు ఈ సినిమా లో నటించబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయం లో క్లారిటీ రాలేదు.
అయితే కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్నట్లుగా మాత్రం వార్తలు వస్తున్నాయి.







