మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించి మెప్పించిన ఈయన ఇప్పుడు కొత్త సినిమాను రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.
ప్రెజెంట్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ కారణంగా కొద్దిగా గ్యాప్ ఇవ్వడంతో ఇటీవలే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ విభిన్నమైన లుక్స్ లో కనిపించి సినిమాకే హైలెట్ గా నిలుస్తాడట.ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న చరణ్ గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట.
ఇన్ని వార్తలు బయటకు రావడంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటి నుండో ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులకు రోజురోజుకూ నిరాశనే ఎదురవుతుంది.ఇక గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి డిసెంబర్ 31కి అప్డేట్ వస్తుంది అని ఎదురు చూసిన వారికీ ఈసారి కూడా నిరాశ తప్పదట.
ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ 31కి వస్తుంది అని టాక్ రాగా ఇది నిజం కాదని తెలియడంతో మరోసారి చరణ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.ఇక ఇదిలా ఉండగా.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.చూడాలి ఈ సినిమాతో చెర్రీ విజయాన్ని కొనసాగిస్తాడో లేదో.