దసరాకు రాబోతున్న అతి పెద్ద తెలుగు సినిమా ఇదే

జయం రవి మరియు అరవింద స్వామి లు నటించిన తమిళ సినిమా బోగన్‌ తెలుగు రీమేక్ రైట్స్ ను మూడేళ్ల క్రితం నిర్మాత రామ్ తాలూరి కొనుగోలు చేశాడు.

ప్రముఖ హీరోలతో ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్న ఆయన కోరిక తీరలేదు.

మల్టీస్టారర్ కథ అవ్వడం వల్ల హీరోల ఎంపిక విషయంలో చాలా చర్చలు జరిగాయి.ఒక హీరోను మామూలు నటుడితో చేయిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అసలు పట్టాలెక్కలేదు.

రీమేక్‌ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ఎలాగూ కొనుగోలు చేసిన ఆయన ఎందుకు వృదా చేయడం అనుకున్నాడో ఏమో గాని ఇటీవల ఆ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేశాడు.శాటిలైట్ మరియు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఈ లోపు థియేటర్ల ఓపెన్‌కు కు సంబంధించి కేంద్రం నుండి మార్గదర్శకాలు వచ్చాయి.అక్టోబర్ 15 నుండి థియేటర్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపధ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

డిజిటల్ ప్లాట్ ఫామ్ మరియు శాటిలైట్ ల కంటే ముందు థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ 15న లేదా మూడు నాలుగు రోజులు అటూ ఇటుగా సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు.తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన బోగన్‌ సినిమా తెలుగులో ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

తెలుగులో లాక్‌ డౌన్‌ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా ఇదే అవ్వడంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.అరవిందస్వామి మరియు జయం రవి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది.

కనుక ఈ సినిమా థియేటర్లలో ఆడే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు