సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రెండు మూడేళ్ల పాటు వరుసగా విజయాలను సొంతం చేసుకోవడం హీరోయిన్లకు కష్టమవుతోంది.ఏడాది పాటు వార్తల్లో నిలిచిన కృతిశెట్టి ప్రస్తుతం సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకునే విషయంలో తడబడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నయి.
కృతిశెట్టికి ఏడాదిలోనే వరుస షాకులు తగలడం ఫ్యాన్స్ ను సైతం ఆశ్చర్యపరిచింది.అయితే హీరోయిన్ తమన్నా మాత్రం ఇప్పటికీ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న తమన్నా తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ కెరీర్ కు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.తాను యాక్టర్ కావాలని అనుకున్న సమయంలో చిన్నచూపు చూశారని ఆమె అన్నారు.
స్కూల్ లో సైతం నేను యాక్టర్ కావాలని చెప్పడంతో అందరూ అదోలా చూసేవారని తమన్నా కామెంట్లు చేశారు.కానీ నేను ఆ కామెంట్లను పట్టించుకోలేదని పేర్కొన్నారు.

చదువును, షూటింగ్ లను బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ ను కొనసాగించానని అమె కామెంట్లు చేశారు.మా ఫ్యామిలీ నన్ను ఎంతగానో ప్రోత్సహించిందని తమన్నా అన్నారు.బాలీవుడ్ తారలను నేను ఎంతో ఇష్టపడ్డానని బోర్డ్ ఎగ్జామ్స్ సమయంలో తాను కమర్షియల్ యాడ్ లో నటించానని తమన్నా చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో ఇబ్బందులను అధిగమించి కెరీర్ ను కొనసాగించానని ఆమె తెలిపారు.

సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలోనే సవాళ్లు కూడా ఎదురయ్యాయని తమన్నా కామెంట్లు చేశారు.ఆ సవాళ్లను చూసి భయపడలేదని తమన్నా పేర్కొన్నారు.పురుషాధిక్య సమాజంలో మహిళలు తాము అనుకున్నవి సులువుగా సాధించలేరని అయితే కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల నేను అనుకున్నది సాధించడం సాధ్యమైందని ఆమె అన్నారు.తమన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
హీరోయిన్ తమన్నా కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.







