ఈ పొడిని ప్రతి రోజు రాత్రి పాలలో.. కలుపుకొని తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషికి శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా కచ్చితంగా చేసుకుంటూ ఉండవచ్చు.లేదంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది.

ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే లభిస్తూ ఉంది.అయినా చాలా మంది బయట ఆహార పదార్థాలనే తింటూ ఉన్నారు.

వాటిలో ఉపయోగించే సాస్, మసాలాలు తప్పించి ఆరోగ్యానికి అవసరమైనవి ఏమీ ఉండడం లేదు.దీంతో చాలా మంది ప్రజలలో బలహీనత, నీరసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి.

శరీరానికి తగినంత శక్తిని ఇస్తే శరీరం బలంగా ఉంటుంది.అయితే ఇప్పుడు మనం తయారు చేసుకునే పొడిని రోజు ఒక గ్లాసు పాలలో( Milk ) కలుపుకొని తాగితే కొద్ది రోజుల్లోనే ఎంతో తేడా కనిపిస్తుంది.

Advertisement

ఇది రోగనీరొదక శక్తిని( Immunity Power ) కూడా పెంచుతుంది.మరి ఆ పొడి కి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే నువ్వులు( Sesame ) రెండు స్పూన్లు, గసగసాలు రెండు స్పూన్లు, 8 బాదం పప్పులు( Badam ) ఉంటే సరిపోతుంది.అలాగే నువ్వులు, గసగసాలు, బాదంపప్పులను తీసుకొని బాగా వేయించాలి.

ఆ తర్వాత వీటిని మెత్తగా పొడిలా చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాసు పాలలో కలిపి పిల్లలకు, పెద్దలకు, వయసు మళ్ళిన వాళ్లకు ఇస్తే బలంగా తయారవుతారు.వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి వీరికి లభిస్తుంది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

ఈ పొడిని పాలతో తాగడం ఇష్టం లేనివారు గోరువెచ్చని నీటిలో( Warm Water ) అయినా త్రాగవచ్చు.రెండు స్పూన్ల పొడి నీ పాలలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించాలి.

Advertisement

ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం పొడిని కలుపుకొని తాగడం మంచిది.బెల్లం( Jaggery ) అంటే ఇష్టం లేనివారు పటిక బెల్లాన్ని కలుపుకొని తాగవచ్చు.ఇలా చేసుకున్న పొడి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా రాత్రి నిద్ర పోవడానికి ముందు తాగిన ఆరోగ్యానికి ఎంతో మంచిది.

గసగసాలు నిద్ర రావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.కాబట్టి రాత్రి సమయంలోనే తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు