స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించిన తోలి ఆసియాన్ దేశం

బ్రిటన్,ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో స్వలింగ వివాహాలకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆసియాలోనే తొలిసారిగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విధంగా తైవాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ 2017 మేలో తీర్పునిచ్చిన తైవాన్ రాజ్యాంగ న్యాయస్థానం ఇందుకు సంబంధించిన చట్టాన్ని రూపొందించేందుకు పార్లమెంట్ కు రెండేళ్ల గడువునిచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్ట బద్దత కల్పించే బిల్లుకు తైవాన్ పార్లమెంట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది.

గత రెండు దశాబ్దాలుగా ఎల్జిబిటి (లెస్బియన్, గే, బై సెక్స్వల్, ట్రాన్స్జెండర్) హక్కుల కోసం అక్కడ పోరాటాలు కొనసాగుతున్నాయి.అయితే శుక్రవారం ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం తో ఇది వారికి దక్కిన పెద్ద విజయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ తరహా వివాహాలకు చట్టబద్దత కల్పించే విధంగా పార్లమెంట్ లో బిల్లు ను ఆమోదించాలి అని కోరుతూ అటు ఎల్జీబిటి గ్రూపు లు కోరుతుండగా, మరోపక్క చర్చ్ సంస్థల వ్యతిరేకత ఈ రెండిటి నడుమ తైవాన్ పార్లమెంట్ మొత్తానికి ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.అలానే స్త్రీ-పురుష జంటలకు కల్పించే పన్ను, బీమా, పిల్లల పెంపకం వంటి ప్రయోజనాలను స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలకు కూడా కల్పించాలని చేసిన ప్రతిపాదనను సైతం పార్లమెంట్ సభ్యులు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం తెలపడం విశేషం.

Advertisement

ఈ తాజా నిర్ణయం తో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి ఆసియన్ దేశంగా తైవాన్ రికార్డులకెక్కింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు