గతంలో రాఘవేందర్ రావు పై విమర్శలతో తాప్సి ఎంత వివాదాస్పదంగా మారిందో అందరికి తెలిసిందే.తాజాగా మరోసారి నెటిజెన్ల ట్రోల్స్ కు గురైంది.
కానీ వారికి గట్టి కౌంటర్ ఏ ఇచ్చింది ఈసారి.దక్షిణాది సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది.
బేబీ, నామ్ షబానా, పింక్ వంటి సినిమాలతో నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.
ఇది ఇలా ఉంటె.” బాలీవుడ్‌లో కెల్లా చెత్త నటిలా అనిపిస్తుంది.ఇంకోసారి నేను ఆమెను చూడాలనుకోవడం లేదు.2 లేదా 3 చిత్రాలకు మించి ఆమె ఇక్కడ కొనసాగలేదు.త్వరలో ఈమె బాలీవుడ్‌నుంచి వెళ్లిపోతుందని” ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
దానికి తాప్సి ఎలా స్పందించింది అంటే.?
But 3 toh already ho gayi….and then and sorry to disappoint u but main already do aur sign kar chuki hu….thoda toh aur jhelna padega 🤷🏻♀️
— taapsee pannu (@taapsee)
ఈ ట్వీట్‌కు స్పందించిన తాప్సీ… ‘అయ్యె ఆల్‌రెడీ ముల్క్, మన్‌మర్జియాన్, బద్లా సినిమాల్లో నటించేశానే.మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను.మిమ్మల్ని చాలా నిరుత్సాహ పరిచాననుకుంటా.కానీ ఏం చేద్దాం మీరు ఇంకొంచెం బాధను దిగమింగాల్సిందే.ఓ నటిగా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాను.
కేవలం ముఖాలు చూసే మీరు ఇకపై నటనను కూడా చూస్తే బాగుంటుంది.జై శ్రీరాం’ అంటూ వరుస ట్వీట్లతో అతడి నోరు మూయించారు.
తాప్సీ సమాధానంతో సంతోష పడిన ఆమె అభిమానులు.మేడమ్ మీరు ఎప్పుడూ ఇలాగే ధైర్యంగా ఉండాలి.
మంచి సమాధానమిచ్చారంటూ ఆమెకు అండగా నిలిచారు.
Matlab Entertainment toh provide kar rahi hu main aapko.
Matlab actress ka kaam toh ho gaya 😁 P.S- please apna taste behtar keejiye toh picturein bhi dekh payenge.Jai ShreeRam 🙏🏼
— taapsee pannu (@taapsee)
సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ట్రోల్ చేయడం ఇది కొత్తేమి కాదు.కాకపోతే చాలా మంది నటులు రిప్లై ఇవ్వరు.
తాప్సి స్పందించి కౌంటర్ ఇచ్చారు.