టీ-20 వరల్డ్ కప్ విజేత ప్రైజ్ మనీ ఖరారు.. ఎంతో తెలుసా..!?

పురుషుల టీ-20 వరల్డ్ కప్ విజేత, రన్నరప్ టీమ్స్ కు ఇచ్చే ప్రైజ్ మనీని ఆదివారం ప్రకటించింది ఐసీసీ.విజేతకు పదహారు లక్షల డాలర్లు (సుమారు రూ.

12.2 కోట్లు), రన్నరప్ కు అందులో సగం అంటే 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6 కోట్లు) ఇవ్వనున్నట్లు తెలిసింది.ఈ టోర్నీ మొత్తానికి 56 లక్షల డాలర్లు (సుమారు రూ.42.1 కోట్లు) ప్రైజ్ మనీ గా ఇవ్వనున్నారు.ఈ మొత్తం టోర్నీలో పాల్గొనే 16 జట్లు ఎంతో కొంత మొత్తాన్ని అందుకోనున్నాయి.

సెమీఫైనల్లో ఓడిపోయే రెండు టీమ్స్ లో ఒక్కో దానికి నాలుగు లక్షల డాలర్లు (సుమారు మూడు కోట్ల) ఇవ్వనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటన తెలిపింది.ఈసారి లీక్ స్టేజ్ లో మొత్తం 30 మ్యాచ్ లు జరుగనున్నాయి.

గెలిచే టీం కు 40 వేల డాలర్లు ఇవ్వనున్నారు.ఆ లెక్కన లీగ్ స్టేజ్ మొత్తం ప్రైజ్ మనీ 12 లక్షల డాలర్లకు చేరనుంది.

సూపర్ 12 స్టేజ్ లో పాల్గొనే వాటిలో ఎనిమిది టీమ్స్ ఖరారయ్యాయి.మిగతా నాలుగు టీమ్స్ ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే అర్హత మ్యాచ్ ద్వారా క్వాలిఫై అవుతాయి.

Advertisement

ఇక లీగ్ స్టేజ్ లోనే ముగిచే సూపర్ 12 లోని టీమ్స్ ఒక్కోదానికి 70 వేల డాలర్లు ఇస్తారు.టోర్నీ తొలి రౌండ్లో భాగంగా జరిగే అర్హత మ్యాచ్ లలో  బంగ్లాదేశ్, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక పాల్గొననున్నాయి.ఇక ఒక్కో మ్యాచ్ లో రెండు డ్రింక్స్ బ్రేక్ లు ఉంటాయి.

ఇన్నింగ్స్ మధ్యలో రెండున్నర నిమిషాల పాటు ఈ బ్రేక్ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు