టి. బీజేపీ పరిస్థితి ఇలా అయ్యిందేంటి ? 

తెలంగాణలో బిజెపి( BJP party ) పరిస్థితి ఎటూ అర్థం కాకుండా ఉంది.

ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో క్రమ క్రమంగా ఆ పార్టీ బలహీనపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

కొద్ది నెలల క్రితం వరకు బిజెపిలో మంచి జోష్ కనిపించేది.కీలక నాయకులంతా బీఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరడం,  బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి బలోపేతం కావడం ఇవన్నీ ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

అయితే ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది చేరికలు నిలిచిపోవడం,  పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ వైపు వెళుతూ ఉండడం , అలాగే  బిజెపిలో చేరాలని చూసిన చాలామంది కీలక నాయకులు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం,  ఇవన్నీ మరింతగా టెన్షన్ పెట్టిస్తున్నాయి.  ఢిల్లీలో జరిగిన సమావేశంలో బిజెపి కీలక నేత , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ( Amit Shah )తెలంగాణలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు.

T. What Happened To Bjps Situation, Telangana Bjp, Bjp, Congress, Kishan Reddy,

 వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసే విధంగా బిజెపి అగ్ర నేతలు దృష్టి సారించారు.మిషన్ 75 టార్గెట్ గా పనిచేయాలని ఏపీ , తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు.అయినా ఈ విషయంలో ముందుకు వెళ్లడంలో రెండు రాష్ట్రాల నాయకులు వెనుకబడినట్టుగానే  కనిపిస్తున్నారు.

Advertisement
T. What Happened To BJP's Situation, Telangana BJP, BJP, Congress, Kishan Reddy,

   కాంగ్రెస్ తెలంగాణలో దూకుడు పెంచడం ఇవన్నీ బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.

T. What Happened To Bjps Situation, Telangana Bjp, Bjp, Congress, Kishan Reddy,

 కర్ణాటకలో బిజెపి విజయం సాధిస్తే .ఆ దోస్తీ తెలంగాణలో కనిపిస్తుందని అంచనా వేసినా,  కాంగ్రెస్ ( Congress )విజయం సాధించడంతో తెలంగాణలో పరిస్థితులు తారుమారయ్యాయి.ఆ ప్రభావం తెలంగాణ బిజెపిపై స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేకొద్ది ఉత్సాహంగా ఉంటూ,  పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల పార్టీ నేతల్లో కనిపించాల్సి ఉన్నా , ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బిజెపి నాయకుల్లో నిరుత్సాహం అలుముకున్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు